కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు విచారణకు సహకరించలేదు: ఏసీబీ

ABN , First Publish Date - 2020-09-03T21:20:39+05:30 IST

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు విచారణకు సహకరించలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. లాకర్ కీ, డాక్యుమెంట్లు, చెక్కులపై నాగరాజు నోరు మెదపలేదని, తన పేరిట ఆస్తులు ఉన్నట్లు

కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు విచారణకు సహకరించలేదు: ఏసీబీ

హైదరాబాద్: కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు విచారణకు సహకరించలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. లాకర్ కీ, డాక్యుమెంట్లు, చెక్కులపై నాగరాజు నోరు మెదపలేదని, తన పేరిట ఆస్తులు ఉన్నట్లు వాస్తవమే అని నాగరాజు ఒప్పుకున్నట్లు ఏసీబీ పేర్కొంది. 2011లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఏసీబీ నమోదు చేసింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.10కోట్ల ఆస్తులు ఏసీబీ గుర్తించింది. బ్యాంకు లాకర్‌లో రూ.55లక్షల బంగారు ఆభరణాలు ఏసీబీ అధికారులు స్వాదీనం చేసుకున్నారు. నాగరాజు బినామీ ఆస్తులు, ఆస్తుల డాక్యుమెంట్స్‌పై ఏసీబీ విచారిస్తోంది.


నాగరాజుకు ముందు నుంచి అవినీతి చరిత్ర ఉంది. ఆయనపై 2011 జూన్‌లో ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టుకున్న కేసు ఉంది. అప్పట్లోనే నాగరాజు ఇంట్లో కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించారు. ఆయన ఇంట్లో విదేశీ మద్యం బాటిళ్లతో ఓ మినీ బార్‌ ఉండటాన్ని చూసి తెల్లబోయారు. అప్పట్లో ఈ కేసు ఓ సంచలనం. అయితే.. కొందరు పెద్దల అండదండలతో మూడు నెలల క్రితమే నాగరాజు ఆ కేసు నుంచి విముక్తి పొందాడు. ఏసీబీ అధికారులు కోట్ల రూపాయల్లో అక్రమాస్తుల్ని గుర్తించినా.. క్లీన్‌చీట్‌ తీసుకోగలిగాడు.


Updated Date - 2020-09-03T21:20:39+05:30 IST