కీసర ఎమ్మార్వో కేసులో కీలక పరిణామాలు
ABN , First Publish Date - 2020-09-03T22:13:48+05:30 IST
కీసర ఎమ్మార్వో కేసులో కీలక పరిణామాలు

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కోటి రూపాయల అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏసీబీ అధికారుల విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తహశీల్దార్ కేసులో నిందితుల ఏసీబీ కస్టడీ వాగ్మూలం ఇచ్చారు. నిందితుల వాగ్మూలంలో కలెక్టర్, కీసర ఆర్డీవో, మరో ఎమ్మార్వో పేర్లు కూడా ఉన్నాయి. హన్మకొండ ఎమ్మార్వో కిరణ్ ప్రకాష్ ద్వారా కీసర ఆర్డీవో రవితో ఒప్పందం కుదుర్చుకున్నట్టు A3 శ్రీనాథ్ పేర్కొన్నారు. అలాగే కీసర ఆర్డీవో రవి ద్వారానే ఎమ్మార్వో నాగరాజుతో ఒప్పదం చేసుకున్నట్లు వెల్లడించాడు. దాయరలోని 614, మరికొన్ని సర్వేనెంబర్లలో 61 ఎకరాలు..A-2 వీఆర్‌ఏ సాయిరాజ్, A-4 అంజిరెడ్డి ద్వారా అగ్రిమెంట్ కుదిరిందన్నారు. మొయినుద్దీన్‌తో పాటు మరో 37 మంది నుంచి భూమి అగ్రిమెంట్ చేశానని A3 నిందితుడు శ్రీనాథ్ చెప్పారు. కలెక్టర్‌తో భూమి మ్యూటేషన్ చేయించే బాధ్యత ఆర్డీవో, ఎమ్మార్వో చూసుకున్నారని పేర్కొన్నారు. రూ.1.10 కోట్లు వరంగల్ నుంచి తీసుకొచ్చానని, కలెక్టర్, ఆర్డీవో ఆదేశాలతోనే భూవివాదంపై మాట్లాడేందుకు గెస్ట్‌హౌస్‌కు వెళ్లానని A1 నిందితుడు నాగరాజు పేర్కొన్నారు. A3 నిందితుడు శ్రీనాథ్‌కు చెందిన ఎలాంటి భూవివాదం తన పరిధిలో లేదని A1 నిందితుడు నాగరాజు వెల్లడించాడు.