జీహెచ్‌ఎంసీ ఎన్నికలయ్యే వరకూ ఉత్తమ్‌నే కొనసాగించండి

ABN , First Publish Date - 2020-09-29T07:36:39+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక ముగిసే వరకూ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌నే కొనసాగించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఒక వేళ మార్చదలుచుకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తన

జీహెచ్‌ఎంసీ ఎన్నికలయ్యే వరకూ ఉత్తమ్‌నే కొనసాగించండి

  • మార్చాలనుకుంటే నాకు అవకాశం ఇవ్వండి 
  • మణిక్కం ఠాగూర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినతి
  • కోర్‌ కమిటీ భేటీకి ఎందుకు రాలేదన్న ఠాగూర్‌
  • వ్యక్తిగత కారణాలతోనే రాలేదని జగ్గారెడ్డి వివరణ


హైదరాబాద్‌, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక ఉప ఎన్నిక ముగిసే వరకూ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌నే కొనసాగించాలని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఒక వేళ మార్చదలుచుకుంటే తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తన బయోడేటాను ఆయనకు సమర్పించారు. తనకు పదవి ఇవ్వడం కుదరని పక్షంలో... ఎవరికి ఇవ్వాలన్న దానిపైనా తన అభిప్రాయం చెబుతానని పేర్కొన్నారు. సీఎల్పీ కార్యాలయంలో భేటీ సందర్భంగా జగ్గారెడ్డితో ఆయన ముఖాముఖి మాట్లాడారు. టీపీసీసీ కోర్‌ కమిటీ భేటీ, దుబ్బాక ఉప ఎన్నికపైన జరిగిన సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ఠాగూర్‌ ప్రశ్నించగా.. వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేక పోయానని జగ్గారెడ్డి వివరణ ఇచ్చారు. మరోసారి ఇలా జరగదని పేర్కొన్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఠాగూర్‌ను జగ్గారెడ్డి కోరారు.

Updated Date - 2020-09-29T07:36:39+05:30 IST