నేటి మధ్యాహ్నం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-05-18T16:33:53+05:30 IST

హైదరాబాద్: నేటి మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

నేటి మధ్యాహ్నం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్: నేటి మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారులు, రైతు బంధు అధ్యక్షులు వ్యవసాయ విధానం, పంటల సాగు పద్ధతులపై చర్చించనున్నారు. ఈ ఏడాది రెండు పంటలు కలిపి 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో మాత్రమే రైతాంగం వరి సాగు చేయనుంది. వర్షాకాలం పంటగా కందులను 10 నుంచి 15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని తెలిపే అవకాశం ఉంది. రైతులకు అధికారులు అవగహన కల్పించడంపై సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నారు.

Updated Date - 2020-05-18T16:33:53+05:30 IST