యాదాద్రి గర్భగుడి మెట్ల సంఖ్యపై కేసీఆర్ అసంతృప్తి

ABN , First Publish Date - 2020-09-13T23:06:11+05:30 IST

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణ పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.

యాదాద్రి గర్భగుడి మెట్ల సంఖ్యపై కేసీఆర్ అసంతృప్తి

యాదాద్రి: యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటించారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణ పురోగతిపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే గర్భగుడి మెట్ల సంఖ్యపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆలయ నిర్మాణంపై అధికారులు పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌తో వివరణ ఇచ్చారు. గర్భాలయం వద్ద తంజావూరు నుంచి తెచ్చిన.. చెంచులక్ష్మీ సమేత లక్ష్మీనరసింహస్వామి చిత్రపటం ఏర్పాటు చేశారు. చిత్రపటం అద్భుతంగా ఉందంటూ కేసీఆర్ కితాబిచ్చారు. ప్రధానాలయంలో మూడు క్యూలైన్లను విశాలంగా ఉండేలా రెండుకు తగ్గించాలని కేసీఆర్ సూచించారు.

Updated Date - 2020-09-13T23:06:11+05:30 IST