నేడు ఢిల్లీకి కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-12-11T07:48:53+05:30 IST

సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న

నేడు ఢిల్లీకి కేసీఆర్‌

ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారు?

హైదరాబాద్‌, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తున్నారు. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న ఆయన ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం. సీఎంవో అభ్యర్థన మేరకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఖరారైనట్లు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులపై నివేదికలు సమర్పించనున్నారు.

అలాగే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని సమాచారం. కేసీఆర్‌ వెంట మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ వెళ్లనున్నట్లు తెలిసింది.

Updated Date - 2020-12-11T07:48:53+05:30 IST