రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-12-13T22:29:22+05:30 IST

రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు అనుసరించాల్సిన పద్ధతిపై సీఎం సమీక్ష చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరగాలని ఆదేశించారు.

రిజిస్ట్రేషన్లపై కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్: రిజిస్ట్రేషన్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు అనుసరించాల్సిన పద్ధతిపై సీఎం సమీక్ష చేశారు. అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా రిజిస్ట్రేషన్లు జరగాలని ఆదేశించారు. ప్రజలకు లంచాలు ఇచ్చే గతి పట్టకుండా.. ఏ అధికారికీ విచక్షణాధికారం లేకుండా రిజిస్ట్రేషన్ల విధానం ఉండాలన్నారు. భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై.. మంత్రి ప్రశాంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు, ఇతర వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లపై కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయేతర భూముల విషయంలోనూ ఆ విధానమే రావాలన్నారు. సులభంగా రిజిస్ట్రేషన్ చేయించుకునే విధానం రావాలని కేసీఆర్ చెప్పారు.

Updated Date - 2020-12-13T22:29:22+05:30 IST