కేసీఆర్‌ పాలన అంధకారమయం: అర్వింద్‌

ABN , First Publish Date - 2020-06-04T09:16:01+05:30 IST

ఆరేళ్ల సీఎం కేసీఆర్‌ పాలన అంధకారమయని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. అన్ని రంగాల్లో టీఆర్‌ఎస్‌

కేసీఆర్‌ పాలన అంధకారమయం: అర్వింద్‌

న్యూఢిల్లీ, జూన్‌ 3(ఆంధ్రజ్యోతి): ఆరేళ్ల సీఎం కేసీఆర్‌ పాలన అంధకారమయని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఆరోపించారు. అన్ని రంగాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఢిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంల పనితీరుపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో కేసీఆర్‌కు 16వ స్థానం దక్కిందని, అదే అవినీతిపై సర్వే చేసి ఉంటే తొలి స్థానంలో నిలిచేవారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో 2లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే.. ఆరేళ్లలో 29,015 పోస్టులు మాత్రమే భర్తీ చేశారని వెల్లడించారు. టీఎ్‌సపీఎస్సీ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకున్న 28 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కుటుంబంలో మాత్రం ప్రజలు సస్పెండ్‌ చేసిన వారిని కూడా పునర్నియామకం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-06-04T09:16:01+05:30 IST