కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కేసీఆర్‌ భేటీ

ABN , First Publish Date - 2020-12-12T00:05:57+05:30 IST

ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన

కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కేసీఆర్‌ భేటీ

ఢిల్లీ: ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. కొద్దిసేపటి క్రితం కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌తో కేసీఆర్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మూడు రోజులపాటు అక్కడే ఉండనున్న ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కార్యాలయం ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరింది. అది ఖరారైతే, మోదీతో కేసీఆర్‌ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈసారి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌సహా మరికొందరు కేంద్ర మంత్రులను కలవనున్న సీఎం.. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్‌ నిధులను మంజూరు చేయాలని కోరే అవకాశం ఉంది. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం కోసం కేంద్రం స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-12-12T00:05:57+05:30 IST