గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ సమావేశం
ABN , First Publish Date - 2020-04-01T23:49:16+05:30 IST
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు.

హైదరాబాద్: రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేష్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గవర్నర్‌కు కేసీఆర్ వివరించారు. అంతకుముందు ప్రగతిభవన్‌లో కరోనాపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. నిజాముద్దీన్ సదస్సులకు వెళ్లి వచ్చినవారి వివరాలపై ఆరా తీశారు. సీఎస్, డీజీపీ, వైద్యశాఖ కార్యదర్శితో సీఎం చర్చలు జరిపారు.