భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష

ABN , First Publish Date - 2020-10-21T19:47:01+05:30 IST

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష

హైదరాబాద్: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని చెరువులు, కట్టల పరిస్థితిని పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు. వందేళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో వర్షాలు పడ్డాయన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులకు  కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2020-10-21T19:47:01+05:30 IST