‘ధరణి’ పోర్టల్‌ పై 22న సీఎం కేసీఆర్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-09-21T22:46:44+05:30 IST

దేశంలోనే మొదటిసారిగా విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి’ పోర్టల్‌ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు.

‘ధరణి’ పోర్టల్‌ పై 22న సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: దేశంలోనే మొదటిసారిగా విప్లవాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా రెవెన్యూ రికార్డులను పారదర్శకంగా నిర్వహించడానికి ‘ధరణి’ పోర్టల్‌ రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆకాంక్షించారు. ధరణి పోర్టల్‌ రూప కల్పనపై మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి ఉన్నస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులు ఈ సమావేశానికి సమగ్ర సమాచారంతో రావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

Updated Date - 2020-09-21T22:46:44+05:30 IST