చినజీయర్ ఆశ్రమానికి బయల్దేరిన కేసీఆర్
ABN , First Publish Date - 2020-09-14T22:06:11+05:30 IST
చినజీయర్ ఆశ్రమానికి సీఎం కేసీఆర్ బయల్దేరారు. చినజీయర్ స్వామిని కేసీఆర్ పరామర్శించనున్నారు. చినజీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగతాయారు(
రంగారెడ్డి: చినజీయర్ ఆశ్రమానికి సీఎం కేసీఆర్ బయల్దేరారు. చినజీయర్ స్వామిని కేసీఆర్ పరామర్శించనున్నారు. చినజీయర్ స్వామికి మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగతాయారు(85) అనారోగ్యంతో నారాయణగూడలోని కూతురు నివాసంలో శుక్రవారం రాత్రి పరమపదించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో జీయర్ స్వామి ఆశ్రమం పక్కనే ఉన్న జేబీఎం గార్డెన్స్‌లో శనివారం అంత్యక్రియలను పూర్తి చేశారు.