ఇందిర బాటలో కేసీఆర్‌

ABN , First Publish Date - 2020-06-26T08:28:48+05:30 IST

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బాటలో నడుస్తూ సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు.

ఇందిర బాటలో కేసీఆర్‌

రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ: బండి సంజయ్‌

అంటురోగంలా కుటుంబ పాలన: మురళీధర్‌రావు


హైదరాబాద్‌, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బాటలో నడుస్తూ సీఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. 1975లో ఎమర్జెన్సీ విధించిన ఇందిర.. అవినీతికి, అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిన నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, కళాకారులపై అక్రమ కేసులు పెట్టించి జైళ్లకు పంపించా రని, ఇప్పుడు తెలంగాణలోనూ కేసీఆర్‌ అలాగే చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని ఆరోపించారు. ఎమర్జెన్సీ చివరలో ఇందిర పాలనకు ఏ గతి పట్టిందో టీఆర్‌ఎస్‌ పాలనకూ అదే గతి పట్టనుందన్నారు. ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమానికి కదలి రావాలని, టీఆర్‌ఎ్‌సకు గుణపాఠం చెప్పాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. జూన్‌ 25న దేశంలో ఎమర్జెన్సీ విధించిన సందర్భంగా గురువారం బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమం చేసి జైలుకు వెళ్లొచ్చిన వారితో సమావేశాలు నిర్వహించారు. కుటుంబ పాలన అనే అంటురోగాన్ని అంటగట్టిన పాపం కాంగ్రె్‌సదేనని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్‌రావు మండిపడ్డారు. కాంగ్రె్‌సను చూసి దేశంలో మరికొన్ని పార్టీలు కుటుంబ పాలనే లక్ష్యంగా ఏర్పడ్డాయని విమర్శించారు. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు కొన్ని పార్టీలు కుటుంబాల చేతుల్లో బందీలయ్యాయని విమర్శించారు. పార్టీ, ప్రభుత్వం తమ చేతుల్లోనే ఉండాలన్న లక్ష్యంతోనే కొంతమంది నేతలు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. 

Updated Date - 2020-06-26T08:28:48+05:30 IST