కేసీఆర్‌కు దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టాలి

ABN , First Publish Date - 2020-09-12T08:10:08+05:30 IST

టీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, దుబ్బాక ఉప ఎన్నికలో దెబ్బ కొడితే సీఎం కేసీఆర్‌కు దిమ్మ

కేసీఆర్‌కు దిమ్మ తిరిగేలా దెబ్బ కొట్టాలి

దుబ్బాకలో గెలిచి చరిత్ర సృష్టించాలి: ఉత్తమ్‌

రాష్ట్రంలో దుర్మార్గపు పాలన:  రాజనర్సింహ


హైదరాబాద్‌, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎ్‌సపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందని, దుబ్బాక ఉప ఎన్నికలో దెబ్బ కొడితే సీఎం కేసీఆర్‌కు దిమ్మ తిరిగిపోవాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రానున్న 3 రోజుల్లో దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ కమిటీలు పూర్తి చేయాలని నేతలకు సూచించారు. అన్ని గ్రామాల కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీలూ పూర్తి చేయాలన్నారు.


దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశం శుక్రవారం ఇందిరాభవన్‌లో జరిగింది. ఉత్తమ్‌తో పాటు మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కుసుమ్‌కుమార్‌, పొన్నం ప్రభాకర్‌, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, ఉప ఎన్నిక సమన్వయ కర్త నగేష్‌ ముదిరాజ్‌, దుబ్బాక నియోజకవర్గానికి చెందిన గ్రామస్థాయి ముఖ్యనేతలు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచి చరిత్ర సృష్టించాలని, ధృడ సంకల్పం, క్రమశిక్షణతో కార్యకర్తలు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి సంబంధించి టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలు.. వాటిని నెరవేర్చని వైనాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని, ఎన్నికల సమయంలో డబ్బు సంచులు, మద్యం బాటిళ్లతో వచ్చే టీఆర్‌ఎస్‌ నేతలను నిలదీయాలని, దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించాలని దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు.  


కాంగ్రె్‌సలో రిటైర్డ్‌ ఎస్‌ఈ చేరిక 

వరంగల్‌ జిల్లాకు చెందిన రిటైర్డ్‌ ఎస్‌ఈ రవీందర్‌కుమార్‌.. శుక్రవారం గాంధీభవన్‌లో ఉత్తమ్‌ సమక్షంలో కాంగ్రె్‌సలో చేరారు. పార్టీనే నమ్ముకుని కష్టపడేవారికి తగిన గుర్తింపు ఉంటుందని ఈ సందర్భంగా ఉత్తమ్‌ అన్నారు. 


రాములునాయక్‌ దరఖాస్తు

ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వానికి మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఉత్తమ్‌ను శుక్రవారం కలిసి దరఖాస్తును అందించారు. అయితే, ఈ స్థానాన్ని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మానవతారాయ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

కాగా, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గం అభ్యర్థిత్వానికి కూన శ్రీశైలంగౌడ్‌ దరఖాస్తు చేసుకున్నారు. ఈ స్థానాన్ని నేతలు చిన్నారెడ్డి, సంపత్‌కుమార్‌, వంశీచంద్‌రెడ్డి,  హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. 


Updated Date - 2020-09-12T08:10:08+05:30 IST