కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి మార్గదర్శకం: హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-12-21T02:13:21+05:30 IST

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి మార్గదర్శకమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కొత్త సంవత్సరం కానుకగా వచ్చే సోమవారం నుండి రైతుల ఖాతాలె రైతుబంధు జమ చేస్తామని తెలిపారు.

కేసీఆర్ ప్రభుత్వం కేంద్రానికి మార్గదర్శకం: హరీష్‌రావు

హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వం, కేంద్రానికి మార్గదర్శకమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. కొత్త సంవత్సరం కానుకగా వచ్చే సోమవారం నుండి రైతుల ఖాతాలో రైతుబంధు జమ చేస్తామని తెలిపారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే బీజేపీ నాయకులు వాళ్లు అధికారంలో ఉన్నచోట రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పింఛన్‌లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనికి బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో బిల్లులు వసూలు చేస్తూ ఆరు గంటల మించి కరెంటు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. జహీరాబాద్ చెరుకు రైతులకు బిల్లులు ఇవ్వకపోతే కంపెనీని వేలం వేసి రైతులకు బిల్లు ఇపిస్తామని హరీష్‌రావు స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-21T02:13:21+05:30 IST