రైతులకు కేసీఆర్‌ శనిలా దాపురించారు: అరవింద్

ABN , First Publish Date - 2020-11-07T22:47:46+05:30 IST

సీఎం కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు.

రైతులకు కేసీఆర్‌ శనిలా దాపురించారు: అరవింద్

నిజామాబాద్‌: సీఎం కేసీఆర్‌పై ఎంపీ అరవింద్ తీవ్రమైన విమర్శలు చేశారు. తెలంగాణ రైతులకు కేసీఆర్‌ శనిలా దాపురించారని ధ్వజమెత్తారు. వరి సన్నరకం వేయమన్నారని, అయితే మద్దతు ధర ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్‌ కుటుంబం రైస్‌ మిల్లర్ల దగ్గర మామూళ్లు తీసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వమంటే ఢిల్లీలో గజదొంగలు అంటున్నారని, కేసీఆర్‌ అన్ని వ్యవస్థలను నాశనం చేశారని దుయ్యబట్టారు. మామిడిపల్లి ఆర్వోబీని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఆపుతున్నాడని అరవింద్ విమర్శించారు.


మరోవైపు ధాన్యం మద్దతు పరంగా సన్నరకాలను ప్రభుత్వం ఏ-గ్రేడ్‌లో చేర్చకపోవడం రైతులను షాక్‌కు గురిచేసింది. సాధారణ రకం ధాన్యానికి రూ.1888, సన్నాలకు రూ.1868 ధరను ప్రకటించింది. దీంతో నిరాశలో ఉన్న అన్నదాతలను అకాల వర్షాలు మరింత కుంగదీశాయి. భారీ వర్షాలకు చాలా చోట్ల సన్నరకం వరి పంట నేలకొరింది. వర్షాలు పోయి కొద్దోగొప్పో దిగబడి అయినా వస్తుందని అనుకుంటే ఇప్పుడేమో పంటను అగ్గితెగులు, దోమకాటు పట్టి పీడిస్తోంది.

Updated Date - 2020-11-07T22:47:46+05:30 IST