రైతులను మభ్యపెట్టడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2020-09-03T22:20:01+05:30 IST

రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో కేసీఆర్ గెలిచారని, అదే గాలిలో ముక్కుమొహం తెలియని వారు ఎమ్మెల్యేలు

రైతులను మభ్యపెట్టడంలో కేసీఆర్ ఎక్స్‌పర్ట్: జగ్గారెడ్డి

హైదరాబాద్: రైతులను మభ్యపెట్టడంలో సీఎం కేసీఆర్ ఎక్స్‌పర్ట్ అని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. మాయమాటలు చెప్పి రైతుల ఓట్లతో కేసీఆర్ గెలిచారని, అదే గాలిలో ముక్కుమొహం తెలియని వారు ఎమ్మెల్యేలు అయ్యారని తెలిపారు. తాము 24 గంటలు జనాల్లో ఉన్నా ఎన్నికల ముందు.. కేసీఆర్ తెచ్చే రైతు పథకాల వల్ల ప్రతిపక్షాలు ఓడితున్నాయని తెలిపారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలో ఐదో స్థానంలో ఉందని, రాష్ట్రంలో కౌలు రైతులకు ప్రోత్సాహం లేదని జగ్గారెడ్డి విమర్శించారు.

Updated Date - 2020-09-03T22:20:01+05:30 IST