ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌

ABN , First Publish Date - 2020-12-13T17:45:08+05:30 IST

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు.

ముగిసిన సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ఢిల్లీ టూర్‌ ముగిసింది. దీంతో ఆయన హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షాతో పాటు... పలువురు కేంద్రమంత్రులను కేసీఆర్‌ కలిశారు. మోదీ, అమిత్ షాలతో పాటు భేటీ అయిన కేంద్ర మంత్రులతో కేసీఆర్ ఏకాంత చర్చలు నిర్వహించారు. ముఖ్యంగా తెలంగాణకు వరద సాయం చేయాలని అమిత్ షాతో పాటు మోదీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ పథకాలకు రూ.25వేల కోట్లు అందించాలని నీతి ఆయోగ్‌ సూచించిందని, ఈ విషయంలో సహకారం అందించాలని సైతం మోదీని కోరారు.


Updated Date - 2020-12-13T17:45:08+05:30 IST