ఉపఎన్నిక తర్వాత హరీశ్‌కు కేసీఆర్‌ బంపర్‌ గిఫ్ట్‌!

ABN , First Publish Date - 2020-11-03T07:40:51+05:30 IST

సీఎం కేసీఆర్‌ రాజీనామా ప్రకటన చేయడం ఉపఎన్నికల్లో ఒక వేళ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే మంత్రి హరీశ్‌రావుకు ఆయన బంపర్‌ గిఫ్టు ఇస్తారనిపిస్తోందని టీపీసీసీ ప్రచార

ఉపఎన్నిక తర్వాత హరీశ్‌కు కేసీఆర్‌ బంపర్‌ గిఫ్ట్‌!

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి

హైదరాబాద్‌, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): సీఎం కేసీఆర్‌ రాజీనామా ప్రకటన చేయడం ఉపఎన్నికల్లో ఒక వేళ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెలిస్తే మంత్రి హరీశ్‌రావుకు ఆయన బంపర్‌ గిఫ్టు ఇస్తారనిపిస్తోందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి అన్నారు. హరీశ్‌రావు ఓ వైపు దుబ్బాకలో బీజేపీ నేతలపై విరుచుకుపడుతుంటే, ఆయన ప్రచారాన్ని డామినేట్‌ చేసేలా బీజేపీ నేతలకు కేసీఆర్‌ సవాల్‌ విసరడం అనుమానాలకు తావిస్తోందని సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. 


ఈ ప్రకటన బీజేపీ నేతలకే కాకుండా పరోక్షంగా హరీశ్‌రావుకూ సంకేతం ఇచ్చినట్లేనని తెలంగాణా సమాజం భావిస్తోందన్నారు. దుబ్బాక ఉపఎన్నికల్లో బీజేపీ, కాంగ్రె్‌సలకు డిపాజిట్లు రాకుండా చేయాలని చెమటోడుస్తున్న హరీశ్‌రావుకు కేసీఆర్‌ ఊహించని షాక్‌ ఇచ్చినట్లుగా చర్చ జరుగుతోందన్నారు. తాను సీఎం పదవికి రాజీనామా చేసి కేటీఆర్‌ను కుర్చీపై కూర్చోపెట్టబోతున్నారన్న వాదనా వినిపిస్తోందని తెలిపారు. నమ్మినవారి గొంతు కోయడంలో కేసీఆర్‌ స్టైలే వేరని పేర్కొన్నారు.


Updated Date - 2020-11-03T07:40:51+05:30 IST