కరోనాపై రేపు సీఎం కేసీఆర్ అత్యున్నత సమావేశం

ABN , First Publish Date - 2020-03-19T02:15:25+05:30 IST

కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి, మహమూద్‌అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డిలతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు ఆహ్వానం అందింది. అంతే కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు

కరోనాపై రేపు సీఎం కేసీఆర్ అత్యున్నత సమావేశం

హైదరాబాద్: కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మంత్రులు ఈటల, కేటీఆర్‌, ఎర్రబెల్లి, మహమూద్‌అలీ, తలసాని, సబిత, మల్లారెడ్డిలతో పాటు డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుకు ఆహ్వానం అందింది. అంతే కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు కేసీఆర్‌ ఆహ్వానం అందించారని సీఎంవో తెలిపింది. కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పద్ధతులపై నేతలు చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా వుండాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. విదేశాల నుండి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రజలు ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకోవాలని అన్నారు. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు దూరంగా వుండాలని పిలుపునిచ్చారు. కరోనాపై ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.

Updated Date - 2020-03-19T02:15:25+05:30 IST