ఇదివరకు జీవితం వేరు.. ఇప్పుడు లైఫ్ వేరు: ప్రత్యూష

ABN , First Publish Date - 2020-12-28T17:53:56+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం జరగనుంది.

ఇదివరకు జీవితం వేరు.. ఇప్పుడు లైఫ్ వేరు: ప్రత్యూష

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం చరణ్ రెడ్డితో సోమవారం జరగనుంది. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్‌లో ప్రత్యూషను పెళ్లి కూతురిని చేశారు. ఈ సందర్భంగా ప్రత్యూష ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ చరణ్ రెడ్డితో వివాహం జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంతవరకు ఉన్న జీవితం వేరని, ఇప్పుడు కొత్తగా ప్రారంభించబోతున్న లైఫ్ వేరని అన్నారు. తన పెళ్లికి సీఎం కేసీఆర్ వస్తానని చెప్పారని, అలాగే ముఖ్యమంత్రి సతీమణి శోభమ్మ తనకు పట్టుబట్టలు, డైమండ్ నెక్లెస్ పెట్టి సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారని ప్రత్యూష తెలిపారు. చదువు పూర్తయిందని నిమ్స్‌లో ఉద్యోగం వచ్చినట్లు తెలిపారు. తమది ప్రేమ వివాహం కాదని.. పెద్దలు కుదిర్చిన సంబంధమని చెప్పారు.


కన్నతండ్రి, సవతి తల్లి హింసకు గురైన ప్రత్యూషను సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆమె వసతి, విద్య, ఇతర బాగోగులను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు పర్యవేక్షించిన విషయం తెలిసిందే. 

Updated Date - 2020-12-28T17:53:56+05:30 IST