కేసీఆర్‌పై ప్రజలు తిరగబడతారు: విజయశాంతి

ABN , First Publish Date - 2020-07-08T08:17:18+05:30 IST

కేసీఆర్‌పై ప్రజలు తిరగబడతారు: విజయశాంతి

కేసీఆర్‌పై ప్రజలు తిరగబడతారు: విజయశాంతి

హైదరాబాద్‌, జూలై 7(ఆంధ్రజ్యోతి): శిశుపాలుడి తప్పుల మాదిరిగా సీఎం కేసీఆర్‌ తప్పులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌  విజయశాంతి పేర్కొన్నారు. ప్రజల నుంచి తిరుగుబాటును ఎదుర్కొనే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయన్నారు. ప్రతి విషయంలోనూ  మేథావిలా కనిపించేందుకు ప్రయత్నించే కేసీఆర్‌ కరోనా విషయంలో చేతులెత్తేసి అజ్ఞాతంలోకి పోవడం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారిందని ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-07-08T08:17:18+05:30 IST