కేబీఆర్ పార్కు వాకర్స్‌కు గుడ్ న్యూస్
ABN , First Publish Date - 2020-10-07T11:13:49+05:30 IST
కేబీఆర్ పార్కు వాకర్స్‌కు తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్షిక పాసుల రెన్యూవల్ గడువు తేదిని

హైదరాబాద్ : కేబీఆర్ పార్కు వాకర్స్‌కు తెలంగాణ అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. వార్షిక పాసుల రెన్యూవల్ గడువు తేదిని పొడిగించినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. గత జూన్ నెలతో పాసుల గడువు ముగిసినప్పటికీ కరోనా నేపథ్యంలో డిసెంబర్-31 వరకు వార్షిక పాసుల గడువు పెంచినట్లు మంత్రి వెల్లడించారు.
కోవిడ్ ప్రత్యేక పరిస్థితు వల్ల ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేబీఆర్ పార్కును మూసివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. జనవరి -2021లో కొత్త పాసులను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా కేబీఆర్ పార్కు వాకర్స్ అసోసియేషన్.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.