అభివృద్ధికి నోచుకోని కాజీపేట

ABN , First Publish Date - 2020-02-08T14:19:47+05:30 IST

గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధి లో వరంగల్‌, హన్మకొండ..

అభివృద్ధికి నోచుకోని కాజీపేట

  • కొలిక్కిరాని చౌరస్తా సమస్య
  • వీధిన పడిన చిరువ్యాపారులు
  • రైల్వే శాఖ సహకారమే కీలకం
  • రైల్వే స్టేడియాన్ని బస్టాండ్‌ చేయాలని  స్థానికుల విజ్ఞప్తి

కాజీపేట టౌన్‌(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక సంస్థ పరిధి లో వరంగల్‌, హన్మకొండ, కాజీపేట పట్టణా లు ఉండగా వరంగల్‌, హన్మకొండ అభివృద్ధితో పోల్చితే కాజీపేట అంతగా  అభివృద్ధి  చెంద లేదు. కాజీపేట అభివృద్ధి రైల్వేపై ఆధారపడి ఉంది. కాజీపేటలో రైల్వే స్టేషన్‌ ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ఉత్తర-దక్షిణ భార త్‌ను కలిపే వారథిగా కాజీపేట జంక్షన్‌ విలసి ల్లుతుంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన డీజిల్‌ లోకోషెడ్‌తో పాటు మారుతున్న సాంకేతిక ఆధారంగా ఎలక్ర్టిక్‌ లోకోషెడ్‌, పలు రైల్వే విభాగాలు కాజీపేట జంక్షన్‌లో నెలకొల్పబడి నాయి. దీంతో వేలాది మంది కార్మికులు కాజీ పేటలోనే నివసిస్తున్నారు. ఇలాంటి కాజీపేట పట్టణం అభివృద్ధికి ఆమడదూరంలో ఉంది. 


కాజీపేటలో ప్రధానంగా చౌరస్తా విస్తర ణ, బస్టాండ్‌ ఏర్పాటు, వడ్డెపల్లిచెరువులో ము రుగునీరు కలువకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు. కాగ కాజీపేట అభి వృద్ధి కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలపై ఆధారపడి ఉండడంతో పాలకులు అభివృద్ధిపై దోబూచు లాడుతున్నారనే విమర్శలు వినిపిస్తోన్నాయి. 


కాజీపేట పట్టణ చౌరస్తా సమస్య ఏళ్ల తరబడి కొలిక్కిరావడం లేదు. అనేక మంది చి రు వ్యాపారులు ఈ చౌరస్తా కేంద్రంగా వ్యా పారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కా జీపేట చౌరస్తాను స్మార్ట్‌సిటీ పథకం లో భా గంగా అభివృద్ధి చేసేందుకు చిరు వ్యాపారుల దుకాణాలను కొద్ది రోజుల క్రితం తొలగించా రు. దీంతో వారి ఉపాధికి భంగం వాటిల్లింది.


కాజీపేట రైల్వే స్టేడియంలో బస్టాండ్‌ ను ఏర్పాటు చేస్తే కల సాకారమవుతుందని పలువురు చెబుతున్నారు. మండల కేంద్రం కావడంతో పాటు భవిష్యత్తులో కాజీపేట కేం ద్రంగా నియోజకవర్గం ఏర్పడనుందనే ప్రచా రంతో బస్టాండ్‌ ఏర్పాటుకు ప్రాధాన్యం ఏర్ప డింది. ప్రస్తుతం రైల్వే స్టేడియం సభలకు, సమావేశాలకు, మేడారం జాతర సందర్భంగా తాత్కాలిక బస్టాండ్‌ ఏర్పాటుకు కేంద్రంగా మారింది. క్రీడాభివృద్ధికి దోహదపడకుండా నిర్లక్ష్యానికి గురైన ఈ స్టేడియంలో బస్టాం డ్‌ను ఏర్పాటు చేసి ప్రహరీ లోపల చిరు వ్యాపారుల కోసం కాంప్లెక్స్‌ను నిర్మించాలని పలువురు సూచిస్తున్నారు.


కాజీపేట, హన్మకొండ పట్టణ ప్రజల దాహర్తీని తీర్చే వడ్డెపల్లి రిజర్వాయర్‌లో ము రుగునీరు కలువకుండా ఉండాలన్నా రైల్వే శా ఖ సహయ సహకారాలపైననే ఆధారపడి ఉం ది. సోమిడితో పాటు తదితర ప్రాంతాల నుం చి వస్తున్న మురుగు నీటిని దారి మళ్లించా లంటే కాజీపేట జంక్షన్‌-బల్లార్షా రూట్‌లో వడ్డెపల్లి చెరువు వద్ద ఉన్న రైల్వే ట్రాక్‌ కింది నుంచి మోరీని నిర్మించాల్సి ఉంటుంది. అందు వలన రైల్వేశాఖ అనుమతి తప్పనిసరి. టీఆర్‌ ఎస్‌ ప్రజాప్రతినిధులు, కేంద్రంలో బీజేపీ ప్రజాప్రతినిధులు స్పందిస్తే సమస్య పరిష్కా రం అవుతుందని ఇప్పటికైనా వారు స్పందిం చాలని స్థానికులు కోరుతున్నారు.


రైల్వే శాఖ సహకారమే కీలకం: దాస్యం వినయ్‌భాస్కర్‌, చీఫ్‌విప్‌ (ఎమ్మెల్యే, వరంగల్‌ పశ్చిమ) 

కాజీపేట పట్ట ణ అభివృద్ధికి రైల్వే శాఖ సహకారమే కీలకంగా మారిం ది. కాజీపేటలో ప్రారంభమైన ఫిట్‌ లైన్‌ నిర్మాణం ప నులు పూర్తికావాలంటే రైల్వే శాఖ పూర్తి స్థాయిలో నిధులను విడుదల చేయాల్సి ఉంది. అన్ని అర్హతలు ఉన్న కాజీపేట జంక్షన్‌ డివిజన్‌గా ఉన్నతీకరణ జరగా లంటే రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. చిరు వ్యాపారుల కోసం రైల్వే స్టేడియం చుట్టూ కాంప్లెక్స్‌ నిర్మాణం జరగాలన్నా.. రైల్వేశాఖ అనుమతినే ప్రధానం. కాజీపేట పట్టణ అభివృద్ధి అం తా రైల్వేపై ఆధారపడి ఉంది. అందు వల్లనే రైల్వే శాఖ మంత్రిని కలిసి అభివృ ద్ధికి చర్యలు తీసుకోవాలని విన్నవించాం.


Updated Date - 2020-02-08T14:19:47+05:30 IST