డాక్టర్ మౌనికను అభినందించిన కవిత
ABN , First Publish Date - 2020-08-22T08:48:59+05:30 IST
డాక్టర్ మౌనికను అభినందించిన కవిత
హైదరాబాద్, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): వాగులు పొంగి ప్రవహిస్తున్నా లెక్క చేయకుం డా వాటిని దాటి వెళ్లి వైద్య శి బిరం నిర్వహించిన డాక్టర్ మౌనికను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణపురం వైద్యశాలకు 20 కిలో మీటర్ల దూరంలో ని బట్టిగూడెం వెళ్లి మౌనిక వైద్య శిబిరం నిర్వహించారు. ఆమెను అభినందిస్తూ శుక్రవారం కవిత ట్వీట్ చేశారు.