కవితపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశంసలు

ABN , First Publish Date - 2020-03-19T00:12:18+05:30 IST

టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవితపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. కవిత రాష్ట్ర నాయకురాలు, ఆమె సేవలు రాష్ట్రానికి అవసరమని, నిజామాబాద్‌కే కవిత పరిమితం కావద్దని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు.

కవితపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశంసలు

జగిత్యాల: టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవితపై కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి ప్రశంసలు కురిపించారు. కవిత రాష్ట్ర నాయకురాలు, ఆమె సేవలు రాష్ట్రానికి అవసరమని, నిజామాబాద్‌కే కవిత పరిమితం కావద్దని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌కి కవిత సేవలు అవసరం, అందుకే ఆమెకు బాధ్యతలు ఇచ్చారని జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. కవిత ఓటమి తనను బాధించిందని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు.  ఓడినప్పుడు నేతలకు మరింత బాధ్యత పెరుగుతుందని, ఏ పదవి ఇచ్చిన కవిత సక్సెస్ అవుతారని కాంగ్రెస్‌ నేత జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2020-03-19T00:12:18+05:30 IST