బీజేపీలోకి కత్తి కార్తీక

ABN , First Publish Date - 2020-11-21T21:43:18+05:30 IST

బిగ్ బాస్ ఫేమ్, టీవీ యాంకర్ కత్తి కార్తీక త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు.

బీజేపీలోకి కత్తి కార్తీక

హైదరాబాద్: బిగ్ బాస్ ఫేమ్, టీవీ యాంకర్ కత్తి కార్తీక త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. చర్చల అనంతరం పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ పేజీలో ఈ విషయాన్ని తెలిపారు. తాను కిషన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశానని... రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. 


ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేసిన ఆమె ప్రచారంలో అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అధికార పార్టీ నేతలు తనను అనేక విధాలుగా అడ్డుకోవడానికి ప్రయత్నించారని.. అనేక ప్రలోభాలకు గురి చేశారంటూ ఆరోపణలు గుప్పించారు. ప్రశ్నించే గొంతుకగా ప్రజల్లో నిలవాలన్నదే తన ఆశని తన ప్రచారంలో పేర్కొన్నారు. ఈ ఉపఎన్నికల్లో ఆమె 630 ఓట్లు పొందారు.   


Updated Date - 2020-11-21T21:43:18+05:30 IST