ఒక్క నీటి చుక్కనూ పోనివ్వం: కర్నె ప్రభాకర్
ABN , First Publish Date - 2020-05-13T09:24:34+05:30 IST
కృష్ణానది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నుంచి ఒక్క నీటి చుక్కను కూడా అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు పోనివ్వబోమని ప్రభుత్వ విప్ (శాసనమండలి)

హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): కృష్ణానది జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా నుంచి ఒక్క నీటి చుక్కను కూడా అక్రమంగా ఆంధ్రప్రదేశ్‌కు పోనివ్వబోమని ప్రభుత్వ విప్ (శాసనమండలి) కర్నె ప్రభాకర్ స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి 80 వేల క్యూసెక్కులను అక్రమంగా తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మంగళవారం ఒక వీడియో ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌కు సరైన అవగాహన, సమాచారం లేదని ఆయన విమర్శించారు.