కర్ణాటక సరిహద్దు దిగ్బంధం
ABN , First Publish Date - 2020-03-25T09:55:48+05:30 IST
తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో లాక్‌డౌన్ ప్రభావమేమీ లేకుండా.. పడవల ద్వారా కృష్ణానది మీదుగా రాకపోకలు యథేచ్ఛగా

నాగర్‌కర్నూల్/మహబూబ్‌నగర్, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లో లాక్‌డౌన్ ప్రభావమేమీ లేకుండా.. పడవల ద్వారా కృష్ణానది మీదుగా రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయంటూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనంతో పోలీసు యంత్రాంగం కదలింది. నారాయణపేట జిల్లాలో కర్ణాటక సరిహద్దు ప్రాంతాలను, నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఏపీ సరిహద్దులోని కృష్ణానదిలో మరపడవలు నడిచే ప్రాంతాల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాలో.. రాయచూరు సరిహద్దు ప్రాంతమైన కృష్ణా, చేగుంట చెక్‌పోస్టుల వద్ద రెండంచెల భద్రత కొనసాగుతోంది. అంబులెన్సులు, నిత్యావసరాలను తరలించే వాహనాలు మినహా.. ఇతర వాహనాలను రాష్ట్రంలోకి అనుమతించడం లేదు. కలెక్టర్ హరిచందన మంగళవారం చెక్‌పోస్టులను తనిఖీ చేశారు.