స్వీయ నియంత్రణలో కరీంనగర్ వాసులు
ABN , First Publish Date - 2020-03-23T15:03:20+05:30 IST
కరీంనగర్: ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరీంనగర్ జిల్లా వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు.

కరీంనగర్: ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కరీంనగర్ జిల్లా వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. దీంతో కరీంనగర్ వాసులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. నగరంలో జనం అత్యవసరమైతే తప్ప బయటకు రావడం లేదు. జనమంతా ఇంటికే పరిమితమవడంతో మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నగరంలోని పలు చోట్ల అధికారులు స్ప్రే చేశారు.