కరీంనగర్‌లో పరిస్థితి తీవ్రంగా ఉంది
ABN , First Publish Date - 2020-03-24T10:27:14+05:30 IST
కరీంనగర్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ నియోజక వర్గఎంపీ

లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలి: బండి సంజయ్
కరీంనగర్ టౌన్, మార్చి 23: కరీంనగర్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ నియోజక వర్గఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. కరీంనగర్‌లో పాజిటివ్ కేసులు నమోదైన దృష్ట్యా ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు. నిర్లక్ష్యం వద్దని కోరారు. ప్రభుత్వ అధికారుల సూచనలు పాటించాలన్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే తమ కుటుంబంతో పాటు సమాజానికి తీవ్ర హాని చేసిన వారవుతారన్నారు.