పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కారు ప్రమాదంపై వీడిన మిస్టరీ
ABN , First Publish Date - 2020-06-23T01:56:30+05:30 IST
పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరి కారు ప్రమాదంపై వీడిన మిస్టరీ

కరీంనగర్: పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చెల్లెలు, బావ కారు ప్రమాదంపై మిస్టరీ వీడింది. వారిది ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. ఫిబ్రవరి 17న కాకతీయ కాలువలో కారును వెలికితీయగా... కారులో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బావ, సోదరి, మేన కోడలును గుర్తించారు. జనవరి 27న కారు ప్రమాదం జరుగగా... ఫిబ్రవరి 17న వెలికితీశారు. ప్రమాదంపై ఎన్నో అనమానాలు వ్యక్తమయ్యాయి. పలు కోణాల్లో పోలీసులు కేసును దర్యాప్తు చేశారు. ఫెర్టిలైజర్ దుకాణంలో సూసైడ్ నోట్ లభ్యం కాగా.... ఈ ప్రమాదాన్ని ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు.