కరీంనగర్: నేడు వెదురుగట్టలో హరితహారం
ABN , First Publish Date - 2020-07-08T12:37:14+05:30 IST
కరీంనగర్: నేడు వెదురుగట్టలో హరితహారం

హాజరుకానున్న నలుగురు మంత్రులు
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ
చొప్పదండి: వెదురుగట్టలో బుధవారం ప్రారంభించే హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొక్కల పెంపకాన్ని చేపట్టారు. కాగా మంత్రుల పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి పరిశీలించారు.