నాకు వీసా ఇప్పించండి సారూ: జమీల్‌ఖాన్

ABN , First Publish Date - 2020-12-11T23:30:39+05:30 IST

యూఎస్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది. కానీ కరాటే ప్లేయర్ జమీల్ ఖాన్ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ..

నాకు వీసా ఇప్పించండి సారూ: జమీల్‌ఖాన్

హైదరాబాద్: యూఎస్ ఓపెన్ కరాటే చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు అవకాశం వచ్చింది. కానీ కరాటే ప్లేయర్ జమీల్ ఖాన్ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. డిసెంబర్ 18 నుంచి 20 వరకు టోర్నీలో పాల్గొనాలంటే మరో మూడు రోజుల్లో బయల్దేరాలి. అయితే అమెరికా వీసా కోసం జమీల్ ఖాన్ మూడు నెలలుగా తిరుగుతున్నా ఫలితంలేకుండా పోయింది. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను కలిసినా ప్రయోజనం మాత్రం శూన్యం. దీంతో అధికారులు స్పందించాలని జమీల్‌ఖాన్ కోరుతున్నారు. అమెరికా కాన్సులేట్ జనరల్‌తో మాట్లాడి తనకు వీసా ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T23:30:39+05:30 IST