తగ్గించిన వేతనాలు జూన్‌లో పూర్తిగా చెల్లించాలి

ABN , First Publish Date - 2020-06-22T09:32:56+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలోమూడు నెలలుగా తగ్గించిన వేతనాలను జూన్‌ మాసం వేతనంతో కలిపి పూర్తిగా చెల్లించాలని టీఎన్‌జీవో రాష్ట్ర సంఘం ..

తగ్గించిన వేతనాలు జూన్‌లో పూర్తిగా చెల్లించాలి

టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి 


హైదరాబాద్‌, జూన్‌ 21(ఆంద్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలోమూడు నెలలుగా తగ్గించిన వేతనాలను జూన్‌ మాసం వేతనంతో కలిపి పూర్తిగా చెల్లించాలని టీఎన్‌జీవో రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా ఇంటర్‌ బోర్డులో ఉన్న ఆయన విగ్రహానికి రవీందర్‌రెడ్డి పూల మాలవేసి నివాళులర్పించారు. వైరస్‌ సమస్య తీవ్రత నుంచి బయటపడిన వెంటనే ఉద్యోగుల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం కేసీఆర్‌ను కలవనున్నట్టు వివరించారు. 

Updated Date - 2020-06-22T09:32:56+05:30 IST