డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి..

ABN , First Publish Date - 2020-05-29T09:47:22+05:30 IST

బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండో కోడలు సుహారిక(38) గురువారం ఓ పార్టీలో డ్యాన్స్‌ చేస్తుండగా, కుప్పకూలి మృతిచెందారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని హిల్‌రిట్జ్

డ్యాన్స్‌ చేస్తూ కుప్పకూలి..

రాయదుర్గం, మే 28 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రెండో కోడలు సుహారిక(38) గురువారం ఓ పార్టీలో డ్యాన్స్‌ చేస్తుండగా, కుప్పకూలి మృతిచెందారు. రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ కథనం ప్రకారం.. గచ్చిబౌలిలోని హిల్‌రిట్జ్‌ విల్లా్‌సలో సుహారిక, ఆమె భర్త ఫణిందర్‌, తల్లి మల్లిసాగరిక ఉంటున్నారు. గురువారం ఉదయం గచ్చిబౌలికి చెందిన పవన్‌రెడ్డి ఇంట్లో జరిగిన పార్టీకి, సుహారిక తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. ఆ పార్టీలో ఉత్సాహంగా గడిపిన సుహారిక.. డ్యాన్స్‌ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గుండెపోటు వల్ల ఆమె మృతి చెంది ఉంటుందని వారు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికెళ్లి వివరాలు సేకరించారు. సుహారిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2020-05-29T09:47:22+05:30 IST