కుంగిన మొట్లగూడెం హైలెవల్‌ బ్రిడ్జి

ABN , First Publish Date - 2020-08-20T10:25:41+05:30 IST

మండలంలోని మొట్లగూడెం వెళ్లే దారిలో దయ్యాల వాగుపై నిర్మించిన హైలెవల్‌ వంతెన కుంగిపోయింది

కుంగిన మొట్లగూడెం హైలెవల్‌ బ్రిడ్జి

గోవిందరావుపేట, ఆగస్టు 19: మండలంలోని మొట్లగూడెం వెళ్లే దారిలో దయ్యాల వాగుపై నిర్మించిన హైలెవల్‌ వంతెన కుంగిపోయింది. ఇటీవల కురిసి న భారీ వర్షాలకు వారం రోజు లుగా వాగు ఉప్పొంగి ప్రవహి స్తోంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జికి మధ్యభాగంలోని ఓ పిల్లర్‌ కుం గింది. దీంతో ఆదివాసీ గ్రామానికి వెళ్లే జనం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం కింద 2010లో ఈ బిడ్ర్జి మంజూ రైంది. అయితే అటవీశాఖ ఆంక్షలతో నిర్మాణం ఆలస్యమైంది. ఏడేళ్ల తర్వాత 2017 లో తిరిగి పనులు ప్రారంభం కాగా అంచనా వ్యయం కూడా రూ.3.89కోట్లకు పెరి గింది. ఎట్టకేలకు ఆరు నెలల క్రితం నిర్మాణం పూర్తికాగా రాకపోకలు ప్రారంభమ య్యాయి. భారీ వరదలను సైతం తట్టుకునేలా వెల్‌ ఫౌండేషన్‌ పద్ధతిలో పిల్లర్లను నిర్మించినా కుంగిపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2020-08-20T10:25:41+05:30 IST