కామారెడ్డిలో దారుణం.. మహిళా ఉద్యోగినిపై దాడి

ABN , First Publish Date - 2020-09-21T17:23:58+05:30 IST

జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పన్ను వసూలు చేసే మహిళా ఉద్యోగిని రోజాపై మరో ఉద్యోగి రామకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రోజాకు తీవ్ర

కామారెడ్డిలో దారుణం.. మహిళా ఉద్యోగినిపై దాడి

కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి పన్ను వసూలు చేసే మహిళా ఉద్యోగిని రోజాపై మరో ఉద్యోగి రామకృష్ణ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో రోజాకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే దాడి చేసిన ఉద్యోగి రామకృష్ణ బోధన్ మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గతంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా రామకృష్ణ పనిచేశాడు. ఆ సమయంలో రోజాతో రామకృష్ణకు పరిచయం ఉంది. అయితే దాడికి గల కారణాలు తెలియరాలేదు. రోజాపై దాడికి పాల్పడిన రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2020-09-21T17:23:58+05:30 IST