కామారెడ్డి డీఎస్పీ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2020-12-11T08:59:20+05:30 IST

కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల

కామారెడ్డి డీఎస్పీ సస్పెన్షన్‌

 ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు వెలుగులోకి

కామారెడ్డి, డిసెంబరు 10: కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణను సస్పెండ్‌ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఆదాయానికి మించి అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారుల విచారణలో వెలుగు చూడడంతో.. ఇటీవలే అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో డీఎస్పీతో కలిపి ముగ్గురు పోలీసు అధికారులు కటకటాలపాలు కాగా.. ఇప్పటికే సీఐ జగదీశ్‌, ఎస్సై గోవింద్‌ను సస్పెండ్‌ చేశారు.


తాజాగా కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు. ఐపీఎల్‌ బెట్టింగ్‌ వ్యవహారంలో డీఎస్పీ పాత్ర ఏమీ లేదని తేలినప్పటికీ.. ఆయన అక్రమాస్తులపై ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, నల్లగొండ, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పెద్దఎత్తున ఆస్తులు బయటపడినట్లు సమాచారం. దాదాపు రూ.2.11 కోట్ల విలువ గల ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు తమ విచారణలో తేలిందని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ ప్రకటించారు.


Updated Date - 2020-12-11T08:59:20+05:30 IST