కామారెడ్డి: భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన దళితులు

ABN , First Publish Date - 2020-07-28T17:13:33+05:30 IST

కామారెడ్డి: భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన దళితులు

కామారెడ్డి: భిక్కనూర్ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించిన దళితులు

కామారెడ్డి: జిల్లాలోని భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌ను తిప్పాపూర్ గ్రామ దళితులు ముట్టడించారు. గత 15 రోజుల క్రితం దళితులపై గ్రామ బహిష్కరణ కేసును నీరు గార్చేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. భిక్కనూర్ ఎస్సై అగ్రవర్ణాల వారి నుంచి లంచం తీసుకుని కేసులు నమోదు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నను చంపిన తమ్ముడి భార్యను పిలిపించుకుని కావాలని కేసులు పెట్టారని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సై తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. న్యాయం జరిగే వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదిలేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-28T17:13:33+05:30 IST