పోలీసులకు చిక్కిన పని మనిషి లక్ష్మి?
ABN , First Publish Date - 2020-06-22T09:33:34+05:30 IST
కాచిగూడ పీఎస్ పరిధిలోని చప్పల్‌బజార్‌లో వృద్ధురాలు కమలమ్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన పనిమనిషి లక్ష్మిని కాచిగూడ ..

అదుపులో మరో ముగ్గురు కూడా.. వరంగల్‌లో పట్టివేత
బర్కత్‌పుర, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ పీఎస్ పరిధిలోని చప్పల్‌బజార్‌లో వృద్ధురాలు కమలమ్మ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన పనిమనిషి లక్ష్మిని కాచిగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. శనివారం ఉదయం కమలమ్మ ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తుండగా పనిమనిషి లక్ష్మి దిండుతో ముఖంపై ఒత్తిపట్టి చంపి పది తులాల బంగారు ఆభరణాలు, రూ.5వేలు తీసుకుని పారిపోయిన విషయం విదితమే. అదే రోజు సాయంత్రమే సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా వరంగల్‌లో లక్ష్మితోపాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.