వివాహమైన మైనర్లకు ‘కల్యాణ లక్ష్మి’
ABN , First Publish Date - 2020-11-03T07:13:12+05:30 IST
వివాహమైన మైనర్లకు కల్యాణలక్ష్మి ఇప్పించేందుకు ఫోర్జరీ సంతకాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్పీ నంద్యాల
ఫోర్జరీకి పాల్పడ్డ ఇద్దరి అరెస్ట్
మహబూబాబాద్ క్రైం, నవంబరు 2 : వివాహమైన మైనర్లకు కల్యాణలక్ష్మి ఇప్పించేందుకు ఫోర్జరీ సంతకాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేశామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ టౌన్ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. డోర్నకల్, బూర్గుపాడు, దుబ్బతండా, వెన్నారం గ్రామాలకు చెందిన కొంతమంది మైనర్లకు కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు.
దీంతో వారికి కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేసి డబ్బులు ఇప్పించాలనే ఉద్దేశంతో డోర్నకల్‌కు చెందిన కొలిపాక విజయ్, షేక్ సాజీద్‌లు నకిలీ డాక్యుమెంట్(ఆధార్, స్టడీ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్)లపై తేదీలను మార్చి అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు. వివాహామైన ఐదుగురు మైనర్లకు ఇప్పించేందుకు కల్యాణలక్ష్మి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు.
గెజిటెడ్ అధికారి సంతకం ఫోర్జరీ చేసినట్లుగా సంబంధిత అధికారులు గుర్తించి డోర్నకల్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫోర్జరీకి పాల్పడిన విజయ్, సాజీద్‌లను అరెస్టు పోలీసులు చేసి రిమాండ్‌కు తరలించారు.