పురుగుమందు ప్రభావంతో కల్లు విషపూరితం

ABN , First Publish Date - 2020-12-05T08:40:30+05:30 IST

నల్లగొండ జిల్లా చండూరు మండలంలో విషపూరితమైన కల్లు తాగి వ్యక్తి మృతి చెందగా, ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని తుమ్మలపల్లికి చెందిన

పురుగుమందు ప్రభావంతో కల్లు విషపూరితం

 తాగిన వారిలో ఒకరి మృతి.. ముగ్గురికి అస్వస్థత

చండూరు, డిసెంబరు 4: నల్లగొండ జిల్లా చండూరు మండలంలో విషపూరితమైన కల్లు తాగి వ్యక్తి మృతి చెందగా, ముగ్గురు అస్వస్థతకు గురయ్యారు. మండలంలోని తుమ్మలపల్లికి చెందిన రాఘవరెడ్డి పొలంలో ఈత చెట్టుకు పురుగు పట్టింది. పురుగును తొలగిచేందుకు వారం రోజుల క్రితం ఈతచెట్టుకు ఉన్న రంధ్రంలో రాఘవరెడ్డి పురుగులమందు పోశాడు. ఈనెల 2న గీత కార్మికుడు అదే చెట్టు నుంచి కల్లు తీశాడు.


రాఘవరెడ్డి కుమారుడు మల్లికార్జున్‌రెడ్డి, బంధువు లక్ష్మమ్మ, తిమ్మారెడ్డిగూడేకి చెందిన రాసాల నర్సింహ(56), ఇదే గ్రామానికి చెందిన జక్కిలి కొండయ్య గురువారం ఆ చెట్టు కల్లు తాగారు.వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. నర్సింహ, లక్ష్మమ్మ, మల్లికార్జున్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించగా, నర్సింహ శుక్రవారం మృతి చెందాడు.


Updated Date - 2020-12-05T08:40:30+05:30 IST