కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు!

ABN , First Publish Date - 2020-12-15T08:07:20+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపునకు సంబంధించిన పనుల్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

కేంద్రం నుంచి స్పష్టత వచ్చాకే కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు!

హైదరాబాద్‌/భూపాలపల్లి, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన తర్వాతనే కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపునకు సంబంధించిన పనుల్ని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.

అప్పటి వరకు పనుల్ని నిలిపివేయాల్సిందిగా కాంట్రాక్టు సంస్థలకు అధికారులు సూచనలు చేసినట్టు తెలిసింది. కేందం సూచనల మేరకు ఈ ప్రాజెక్టు పనుల్ని చేయాలని గతంలో ఎన్జీటీ ఉత్తర్వులను జారీ చేసిన విషయం తెలిసిందే. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి జగేంద్రసింగ్‌ షెకావత్‌ తాజాగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తూ, కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపు పనుల్ని ఆపేయాల్సిందిగా సూచించారు. దీంతో పాటు 7 ప్రాజెక్టుల పనుల్ని కూడా ఆపాలని పేర్కొన్న విషయం తెలిసిందే.

మూడో టీఎంసీకి సంబంధించిన నిర్మాణ పనులు ప్రస్తుతం పెద్దగా మొదలు కాలేదు. ఇప్పుడిప్పుడే వర్కింగ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో పనుల్ని దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థలు తమ  సైట్‌ కార్యాలయాలను, పనులకు అవసరమైన యంత్రాలను సమకూర్చుకుంటున్నాయి.


Updated Date - 2020-12-15T08:07:20+05:30 IST