కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2020-06-04T00:17:02+05:30 IST

కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతగిరిలో భూములు కోల్పోయిన వారికి.. పరిహారం చెల్లించాలంటూ

కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ

హైదరాబాద్: కాళేశ్వరం అనంతగిరి భూనిర్వాసితుల పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిగింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతగిరిలో భూములు కోల్పోయిన వారికి.. పరిహారం చెల్లించాలంటూ 120 పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపించారు. భూనిర్వాసితులకు పునరావాసం, రీసెటిల్‌మెంట్‌, పరిహారం ఇవ్వాలని రచనారెడ్డి కోర్టును కోరారు. భూనిర్వాసితులందరినీ ఆదుకున్నామని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. 2013 చట్టం ప్రకారం పరిహారం, పునరావాసం, రీ సెటిల్‌మెంట్‌ చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాకుండా 3 నెలల్లో భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది.

Updated Date - 2020-06-04T00:17:02+05:30 IST