కాళేశ్వరంలో లక్షపత్రి పూజలు నిలుపుదల
ABN , First Publish Date - 2020-11-03T21:54:46+05:30 IST
కాళేశ్వరంలో లక్షపత్రి పూజలు నిలుపుదల
జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో లక్షపత్రి పూజలు నిలిపివేశారు. పూజలను నిలుపుదల చేస్తున్నట్లు ఈవో మారుతి ఒక ప్రకటనలో తెలిపారు. లక్షపత్రి పూజ ఆలయంలో సుమారు రెండు గంటల పాటు గర్భాలయంలో ఉంటుంది. వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఒకేసారి ఆరు కుటుంబాలని అనుమతిస్తారు. అందరూ ఒక వద్ద రెండు గంటలపాటు ఉండటంతో కరోనా పెరుగుతుందన్న ఉద్దేశంతో పూజలు ఆపేస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో భక్తులు అత్యధికంగా చేసుకునే పూజల్లో లక్ష పత్రి పూజ ప్రత్యేకం.