అన్నపూర్ణగా కాళేశ్వరం: ఈటల

ABN , First Publish Date - 2020-05-08T10:14:38+05:30 IST

తెలంగాణను సస్యశామలం చేసి, అన్నపూర్ణగా అవతరించే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌

అన్నపూర్ణగా కాళేశ్వరం: ఈటల

పెద్దపల్లి/మహదేవపూర్‌, మే 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను సస్యశామలం చేసి, అన్నపూర్ణగా అవతరించే కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపెల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతి పంప్‌హౌజ్‌ను, అంతర్గాం మండలం గోలివాడ వద్ద సరస్వతీ పంప్‌హౌజ్‌ పనులను ఆయన పరిశీలించారు. అంతకుముందు భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని లక్ష్మి, సరస్వతి బ్యారేజీలతో పాటు.. కన్నెపల్లి వద్ద లక్ష్మి పంప్‌హౌజ్‌ను మంత్రి పరిశీలించారు. వచ్చే జూన్‌ నెలాఖరుకల్లా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి రోజుకు 2.5 టీఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా త్వరితగతిన పనులను పూర్తిచేయాలని సూచించారు.  

Updated Date - 2020-05-08T10:14:38+05:30 IST