15న కాచిగూడలో రైలు కూత

ABN , First Publish Date - 2020-09-13T12:08:45+05:30 IST

లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి ఈ నెల 15న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు రైలు రానుంది. జైపూర్‌- మైసూర్...

15న కాచిగూడలో రైలు కూత

బర్కత్‌పుర (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ తర్వాత తొలిసారి ఈ నెల 15న కాచిగూడ రైల్వేస్టేషన్‌కు రైలు రానుంది. జైపూర్‌- మైసూర్‌ మధ్య వారానికి రెండుసార్లు నడవనున్న ఎక్స్‌ప్రెస్‌ (02976) రైలు జైపూర్‌ నుంచి బయలుదేరి ఈ నెల 15న రాత్రి 11.40 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోనుంది. 16న మధ్యాహ్నం 3.30 గంటలకు ఇక్కడి నుంచి మైసూర్‌కు వెళ్తుందని రైల్వే అధికారులు తెలిపారు. కొవిడ్‌ నిబంధనలు పాటించేలా రైల్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-09-13T12:08:45+05:30 IST