చైనా ప్రభుత్వంపై కేఏ పాల్ సీరియస్

ABN , First Publish Date - 2020-03-23T22:45:46+05:30 IST

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

చైనా ప్రభుత్వంపై కేఏ పాల్ సీరియస్

హైదరాబాద్ : చైనా ప్రభుత్వం కరోనాను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాడు అమెరికాలో ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడిన ఆయన.. చైనాలో కోటి మందికిపైగా కరోనా సోకిందని.. వారిలో లక్షల మంది చనిపోయారన్నారు. కరోనాకు వ్యాక్సిన్‌ కనిపెట్టలేదని పుకార్లను ప్రజలు నమ్మొద్దని ఈ సందర్భంగా కేఏ పాల్ చెప్పుకొచ్చారు. కరోనా వ్యాప్తి చెందకుండా స్వీయ శుభ్రదత పాటించాలని ఆయన సూచించారు.


కాగా.. కరోనా నేపథ్యంలో గత నెల రోజులుగా చైనా వైరస్ సీరియస్‌గా తీసుకోకపోవడం చాలా విచారమన్నారు. అయితే.. ప్రస్తుతం ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రులు దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవడం ఆనందించ తగ్గ విషయమన్నారు. కర్ఫ్యూ అనంతరం చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేసుకోవడం బాధాకరమని పాల్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-03-23T22:45:46+05:30 IST